ఎన్నారై పాలసీ పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ అభినందనీయం అన్నారు ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి అఖండ విజయాన్ని అందించి సీఎం కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపర్చిన తెలంగాణ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.
తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎన్నారై ల సంక్షేమం కోసం త్వరలో తీసుకరాబోతున్న ‘ ఎన్నారై పాలసీ’ పట్ల ప్రకటన చేయడం యావత్ ఎన్నారై సమాజం హర్షిస్తుందన్నారు. ముఖ్యంగా గల్ఫ్ లో నివసిస్తున్న ఎన్నారై బిడ్డల పట్ల కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అలోచించి తానే స్వయంగా గల్ఫ్ దేశాలు పర్యటించి వారి సంక్షేమానికి కృషి చేస్తాననడం , ఎన్నారైల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుందన్నారు.
గత పది సంవత్సరాల నుండి ఎన్నారై తెరాస సంస్థ ద్వారా ప్రపంచ ఎన్నారై సమాజం తో కలిసి తెలంగాణ ఉద్యమంలో నేడు పునర్నిర్మాణం లో పని చేసే అవకాశం కలిగిందని , ముఖ్యంగా ఎన్నారై పాలసీ కోసం గల్ఫ్ బిడ్డలంతా ఎదురుచూస్తున్నారని , ఎన్నో సందర్భాల్లో గల్ఫ్ తెరాస నాయకులు జువ్వాడి శ్రీనివాస్ , సతీష్ కుమార్ , శ్రీధర్ అబ్బగొని , అభిలాష తదితరులు తెలంగాణ నాయత్వాన్ని కలిసి పాలసీ ఏర్పాటుకు తమవంతు కృషి చేశారని నేటి ప్రకటన వారిలో నూతన హుత్సాహాన్ని నింపిందని తెలిపారు .ఎన్నారై పాలసీ కోసం ప్రత్యక కృషి చేసిన మంత్రి కేటీఆర్ , మాజీ ఎంపీ కవిత కు కృతఙ్ఞతలు తెలిపారు.