- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించి నేడు గజ్వేల్ నియోజకవర్గం లోని కొండపాక పరిధిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు ఎన్నారై సింగపూర్ విభాగం నాయకురాలు శ్రావణి రావు ప్రచేతన్ కుమార్ దంపతులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కూమార్ ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారని. ఈ కార్యక్రమాన్ని తాము సింగపూర్ లో ఉండగానే చూసి మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఇక్కడి వచ్చిన తర్వాత ఈరోజు తమ వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటామని తెలిపారు. ఇలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలని పిలుపునిచ్చారు.
- Advertisement -