పెరిగిన సీఎన్‌జీ ధరలు..!

184
cng
- Advertisement -

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ,డీజీల్ ధరల పెంపుతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎన్‌జీ ధరలకు రెక్కలొచ్చాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూపాయి పెరిగి ధర రూ.59.01కు చేరింది.

ఇక పెట్రోల్,డీజీల్‌పై 80 పైసలు పెరుగగా ఢిల్లీలో సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధరను 949.50 రూపాయలకు పెంచారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో కిలో సీఎన్‌జీ ధర రూ.61.58కి పెరిగింది. సీఎన్‌జీ ధరల పెంపుతో కార్లు, ఆటోల యజమానులపై అదనపు భారం పడనుంది.

వరుసగా పెరుగుతున్న నిత్యావసర సరుకులు,పెట్రోల్,డీజీల్,వంట గ్యాస్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

- Advertisement -