ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఏ1గా ఉన్న చంద్రబాబుకు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా తన అరెస్ట్ అక్రమమని వెల్లడించారు చంద్రబాబు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఒకవేళ తప్పుంటే తనను నడిరోడ్డులో ఉరితీయాలన్నారు.
ఏ చట్టం ప్రకారం తనను అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాత్రి 1 గంటకు రావాల్సిన అవసరం ఏముందని… ఎఫ్ఐఆర్‌లో ఏముందో చెప్పాలని నిలదీశారు.మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఇక తెలుగు వారికోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని వెల్లడించారు బాబు. ప్రజా సమస్యలపై పోరాడకుండా కావాలనే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Also Read:చంద్రబాబు అరెస్ట్ వెనుక.. భారీ వ్యూహమా ?