నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

42
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త ఆహార పదార్థాలను తినడానికి చాలమంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సరదాగా అలా బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తినడం అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు నేటి రోజుల్లో చాలమంది అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ లో తయారు చేస్తే నూడుల్స్, ఫ్రైడ్ రైస్, గోబి మంచూరియా.. ఇలా రకరకాల ఐటమ్స్ నోరూరుస్తాయి. వెంటనే ఆవురావురమంటూ తినేస్తాము. అయితే వాటివల్ల మన ఆరోగ్యనికి ఏమైనా హాని కలుగుతుందా అని ఏమాత్రం ఆలోచించము. ముఖ్యంగా నూడుల్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ముప్పే అని నిపుణులు చెబుతున్నారు. .

తగినంతా తింటే ఏ ప్రమాదం లేకపోయినప్పటికి మితిమీరి ఎక్కువగా తింటే మాత్రం మన ఆరోగ్యాన్ని మనదే బెబ్బ తీసుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నూడుల్స్ ను మైదా పిండితో తయారు చేస్తారు. అందువల్ల ఇవి జీర్ణం కావడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అంతే కాకుండా నూడుల్స్ ను నిల్వ వుంచేందుకు కొన్ని రసాయనాలు వాడతారు అవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావట. ఇంకా నూడుల్స్ లో మోనోసోడియమ్ గ్లూటామెట్ అనే రసాయనం ఉంటుంది.

Also Read:టీమిండియా ప్రయోగాలు ఫలిస్తాయా?

అందువల్ల వీటిని ఎక్కువగా తింటే రక్త పోటుకు దారి తీస్తుందట. ఇంకా ఇందులో ఎలాంటి పీచు పదార్థంగాని, ప్రోటీన్స్ గాని ఉండవు. కాబట్టి నూడుల్స్ వల్ల ఎలాంటి పోషకాలు లభించవట. ఇందులో వాడే పరాఫీన్ వ్యాక్స్ అనే కెమికల్ పేగు సమస్యలకు దారి తీస్తుందట. ఇంకా నూడుల్స్ ను అతిగా తింటే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందట. అందువల్ల నూడుల్స్ ను అతిగా తినే అలవాటు ఉన్నవాళ్ళు వీలైనంత త్వరగా మానుకోవడం మచిందని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:బీజేపీలో రచ్చ.. ఈటెలనే కారణమా ?

- Advertisement -