14 నుండి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు!

140
somesh
- Advertisement -

ఈ నెల 14 నుండి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ముమ్మర కసరత్తు చేయగా ఇవాళ, రేపు సెలవులు రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇవాళ, రేపు వ్యవసాయేతర ఆస్తుల డమ్మీ రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రాథమికంగా ప్రస్తుతం ఒక్కో ఎస్‌ఆర్‌వో రోజుకు 24 స్లాట్లు అందుబాటులో ఉంటాయని, ప్రతి 15 నిమిషాలకు ఒకస్లాట్‌ ఉంటుందని తెలిపారు. రద్దీనిబట్టి సిబ్బంది సంఖ్యను మార్చుతూ స్లాట్ల సంఖ్యను పెంచుతామని వివరించారు.

వ్యవసాయభూముల మాదిరిగానే వ్యవసాయేతర ఆస్తులకు సైతం రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేచోట, ఒకే సమయంలో పూర్తికానుంది. అనధికారిక లేఔట్లు, ప్లాట్లు, అక్రమ భవనాలు, ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టిన ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -