ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన నోముల భగత్..

256
nomula bhagath
- Advertisement -

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేశారు నోముల భగత్. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 17న ఉపఎన్నిక పోలింగ్ జ‌రుగగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిపై భగత్‌ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అక్టోబర్ 10,1984లో జన్మించారు భగత్. తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసిన భగత్…014 నుండి నాగార్జున సాగర్‌ టీఆర్ఎస్‌ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నోముల తనయుడిగా స్ధానిక సంస్థల ఎన్నికల్లో కీ రోల్ పోషించారు. నోముల ఎన్‌ఎల్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు భగత్.

- Advertisement -