14,476 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి‌..

25
TRS leads

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 19 రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మిగ‌తా ఆరు రౌండ్ల ఫ‌లితాలు మ‌రికాసేప‌ట్లో వెలువడ‌నున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు సాగ‌ర్ ఓట‌ర్లు మంచి విజ‌యాన్ని అందిస్తున్నారు. రౌండ్ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దూసుకుపోతోంది.

తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 19వ రౌండ్ ముగిసేస‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌ 14,476 ఓట్ల ఆధిక్యంతో ముంద‌జంలో ఉన్నారు.ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి కుమార్ డిపాజిట్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి.