పాపం.. రాజగోపాల్ ను ఎవరు పట్టించుకోవట్లే?

19
- Advertisement -

కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదా ? ఆ పార్టీ నేతలే ఆయనను పక్కన పెట్టేశారా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన మొదట కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికి ఆ తర్వాత మునుగోడు బైపోల్ సమయంలో బీజేపీ చెంతకు చేరారు. ఆ తరువాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. అయితే బీజేపీలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి మొదటి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. ఇక రెండో లిస్ట్ లో మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికి ఆయనకు మంత్రి పదవి వస్తుందనే గ్యారెంటీ కనిపించడం లేదు. దాంతో తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. .

అసెంబ్లీలో ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించడం, రేవంత్ రెడ్డి పాలనను ఆకాశానికెత్తడం చేస్తున్నారు. అయితే ఆయన చేసే వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే పట్టించుకోకపోవడంతో ఒట్టి గాలి మాటలుగా మిగిలిపోతున్నాయి. ఇక ఇటీవల మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు గురించి మాట్లాడుతూ ” హరీష్ రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామని, తనతో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొని రావాలని ” చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ” మీ లాగా పార్టీలు మార్చడం బి‌ఆర్‌ఎస్ నేతలు చేయలేరని.. మీరు ఎంత హడావిడి చేసిన మంత్రి పదవి మీకు రాదని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్స్. మరి మంత్రి పదవి కోసం అటు అసెంబ్లీలోనూ ఇటు మీడియా సమావేశాల్లోనూ తెగ హడావిడి చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ పదవి దక్కుతుందో లేదో చూడాలి.

Also Read:ఆప్ దెబ్బకు బీజేపీకి ఢమాల్?

- Advertisement -