Salaar:‘సలార్ 3’ కూడా..నిజమెంత?

14
- Advertisement -

“సలార్” సినిమా షూటింగ్ దశలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ కి సడెన్ గా ఆలోచన వచ్చింది. ఈ సినిమా కథని ఒక్క భాగంలో చెప్పలేం రెండు భాగాలుగా తీయాలని భావించారు. అలా 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యాక సలార్ రెండో భాగం గురించి ప్రకటించారు. ఇక ఇప్పుడు రెండో భాగం షూటింగ్ కి సన్నాహాలు చేస్తోంది. తాజాగా సలార్ రెండో భాగాన్ని కూడా రెండు భాగాలుగా విభజించి “సలార్ 3” ప్రకటిస్తారు అనేది సోషల్ మీడియా టాక్. “సలార్ 2” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే, నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ రైట్స్ రికార్డు మొత్తానికి కొనుక్కొంది. ఇక హిందీ మార్కెట్ సహా థియేటర్ హక్కుల ద్వారా సలార్ 2 సినిమాకి వచ్చే రెవెన్యూ మామూలుగా ఉండదు. అందుకే, మూడో భాగం కూడా తీస్తే మరింతగా క్యాష్ చేసుకోవచ్చు కదా అని మేకర్స్ భావిస్తున్నారు అని సోషల్ మీడియా మాట. ఐతే, ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ టీం మాత్రం మౌనం వహిస్తోంది. సలార్ మూడో భాగం గురించి మాట్లాడడం లేదు. మరోవైపు, ఇన్ సైడ్ వర్గాలు మూడో భాగం చేసేంత “సలార్”లో కథ లేదని చెప్తోంది.

ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కూడా వచ్చే నెల నుంచి డేట్స్ ఇస్తాడని టాక్. ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. కానీ వచ్చే ఏడాది ఆగస్టు 15, 2025న సలార్ 2 చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ డేట్ కి సినిమా వర్క్ మొత్తం పూర్తి కావడం కొంచెం కష్టం. ఇంతకీ, సలార్ 2 సినిమా విడుదల తేదీతో పాటు మూడో భాగం ఉంటుందా ఉండదా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాలి.

Also Read:Congress:కాళేశ్వరంపై కాంగ్రెస్ రాద్దాంతం!

- Advertisement -