లాక్ డౌన్ తో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నెల రోజులుగా బోసిపోతున్నది.. భక్తులు లేక వేల వేల బోతున్నది…భక్తులు లేకపోవడంతో ఆలయంలో ఉన్న ముగజీవాలైన వేలాది కోతులకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నాయి. భక్తులు ఉన్నప్పుడు మాత్రమే కోతులకు కొబ్బరి చిప్పలు,పండ్లు , పులిహోర , అన్నం ఇలా రోజు ఆహారం దొరికేది.. కానీ ప్రస్తుతం ఆలయానికి భక్తుల దర్శనాలను రద్దు చేయడంతో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.
దీన్ని గమనించిన స్థానికంగా అటో తొలుకునే రమేష్ అనే యువకుడు పండ్లను తీసుకెళ్లి కోతులకు ఆహారాన్ని అందిస్తు వాటి కడుపు నింపుతున్నాడు…. ప్రతి రోజు మధ్యాహ్నం కాగానే తన చేతనైనంత స్థోమతకు తగ్గట్టు పండ్లు కొని గుట్టపైకి వెళ్లి కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు…రమేష్ ముగజీవాలపై ఉన్న ప్రేమను చూసి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నరు.
ఈ అపత్కాలంలో ప్రతి ఒక్కరు ముగజీవాలను ఆదుకోవాలని,,, వాటికి ఆహారం అందించాలని ,ప్రకృతి లో, జీవవైవిధ్య ములో భాగమైన ప్రతి ప్రాణిని కాపాడాలని రమేష్ ప్రజలను కోరుతున్నాడు.