మృగశిర కార్తె… 173 ఏళ్ల చేప ప్రసాదానికి బ్రేక్

508
hyderabad fish medicine
- Advertisement -

హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ గురించి తెలియని వారుండరూ. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ పెద్ద ఎత్తున జరగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తరలివస్తారు. అయితే ఈ సారి చేప ప్రసాదం పంపిణీ ఉండబోదని తెలిపారు బత్తిని బ్రదర్స్.

ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న నేపథ్యంలో చేపమందు పంపిణీని ఈ సారి చేయడం లేదని తెలిపారు. ఇక బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 173 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది.

నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు. వరుసగా మూడు సంవత్సరాల పాటు చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే అస్తమా నయమవుతుందనేది బత్తిని బ్రదర్స్ వాదన.

ఇక మృగశిర కార్తెలో చేపలను తినడానికి ఓ కారణం ఉంది. మృగశిర కార్తె ప్రవేశించడంతో రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోతాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు చేపలల్లో పుష్కలమైన పౌష్టికాహార పదార్థాలు ఉండటం కూడా చేపలు తినడానికి ఓ కారణం.

- Advertisement -