టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత ఎల్‌ రమణ..!

25
ramana

టీడీపీ సీనియర్ నేత,బీసీ నాయకుడు ఎల్ రమణ త్వరలో కారెక్కనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక పాత్ర పోషించగా త్వరలో సైకల్ దిగి కారెక్కనున్నారు.

ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రమణ…రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. 1994లో జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన రమణ, 1996లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. తర్వాత 2009లో జగిత్యాల నుండి తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చేనేత సామాజికవర్గానికి చెందిన రమణ బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు.