మీడియాకు షాకిచ్చిన ప్రియమణి

273
No Entry for Media At Priyamani Wedding
- Advertisement -

దక్షిణాది హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సంవత్సరం క్రితం ఈ జంటకు ఎంగేజ్‌మెంట్ అయింది.   సంవత్సరం పైగా గ్యాప్ తీసుకున్నాక ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది ప్రియమణి జంట. మూడు రోజుల పాటు ఈ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి వేడుక వరకూ ఓ ప్రైవేట్ కార్యక్రమంగా జరుపుకోనున్నారు.

మెహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ ఇలా మూడు రోజులూ సంబరంగా జరగనుంది. రిసెప్షన్ వేడుక మాత్రం సినీ ప్రముఖుల సమక్షంలో జరగబోతోంది. మూడు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ, రిసెప్షన్ జరగనున్నాయి. అయితే, వీరి వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరగనున్నట్టు సమాచారం. అయితే ప్రియమణి తన వివాహ వేడుకకు  మీడియాకు షాక్ ఇచ్చిందట.

తన పెళ్ళికి ఏ మీడియా సభ్యులు రావొద్దని ముందే చెప్పేసిందట ఈ హీరోయిన్. అంతే కాకుండా పిలవనందుకు ఏమనుకోకండి అంటూ.. పెళ్లి తర్వాత తన పోటోలను మీడియాకు ఇస్తానని చెప్పిందట. తన పెళ్ళి ఇంత సీక్రెట్ గా చేసుకుంటున్న ఈ యమదొంగ పిల్ల ఎందుకు అలా చేస్తుందో ఎవ్వరికి అర్ధం కావడంలేదట.  ప్రియమణికి కాబోయే భర్త ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ నడుపుతున్నారు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

- Advertisement -