Prabhas:మాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్‌..!

27
- Advertisement -

హీరోగా, దర్శకుడిగా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఏ హీరో అయిన ఏడాదికి ఒకటి లేదా రెండు.. ఇంకా మహా అంటే పది సినిమాలు చేస్తారు. కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం 2023లో ఏకంగా 12 సినిమాలు, 8 వెబ్ సిరీస్ లు ఇలా అన్నీ కలిపి ఏకంగా 20 వాటిల్లో పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఇక నటనే కాదు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుని పలు భాషల్లో రిలీజ్ అయ్యాయంటే అర్ధం చేసుకోవచ్చు.

Also Read:తమలపాకుతో ఆ రోగాలకు చెక్..

తాజాగా ఈ క్రేజీ స్టార్..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయనున్నారట. రీసెంట్‌గా ప్రభాస్‌కి ఓ కథను వినిపించారట సుకుమారన్. ఓ గ్యాంగ్ స్టర్ తరహా చిత్రం కాగా ప్రభాస్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని టాక్. ఒకవేళ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే సుకుమారన్ కథలు వైవిథ్యంగా ఉంటాయి. ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో దిట్ట. కాబట్టి ఈ ప్రాజెక్టు హిట్ కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.

Also Read:‘బ్రో’ కంటతడి పెట్టిస్తుంది: పవన్

- Advertisement -