జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటుపై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలో కూడా పవన్ పేరు లేకపోవడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. తాజాగా విడుదల చేసిన మొదటి జాబితాలో చంద్రబాబు కుప్పం, లోకేష్ మంగళగిరి.. నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి బరిలో దిగుతారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు కేవలం పవన్ పోటీ చేసే సీటు మాత్రమే పెండింగ్ లో ఉంది. గత కొన్నాళ్లుగా పవన్ పోటీ చేసే స్థానంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి, గాజువాక, పిఠాపురం, భీమవరం.. ఇలా ఆయా స్థానాల పేరు తెరపైకి వచ్చాయి. ఇటీవల పవన్ భీమవరంలో పర్యటించడంతో ఆ సీటు నుంచే పోటీ చేయబోతున్నడంటూ గట్టిగానే వార్తలు వినిపించాయి.
దీనిపై తొలి జాబితాలో క్లారిటీ వస్తుందని భావించినప్పటికి అలా జరగలేదు. దీంతో సెకండ్ లిస్ట్ లో పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై సమాచారం లేదు. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమేనని వినికిడి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓటమి చవిచూశారు పవన్. దాంతో ఈసారి కేవలం ఒకే స్థానంలో అది కూడా భీమవరం నుంచి మాత్రమే బరిలో దిగే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిరేపుతున్న ప్రశ్న. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసులు పవన్ పై విజయం సాధించారు. మరి ఈసారి పవన్ కు పోటీగా గ్రంథి శ్రీనివాసులునే జగన్ బరిలోకి దించుతారా ? లేదా అభ్యర్థిని మార్చుతారా ? అనేది చూడాలి.
Also Read:Janasena:’సిద్దం’మైన టీడీపీ జనసేన?