ఎలక్షన్స్ పై మోడీకే క్లారిటీ లేదా?

42
- Advertisement -

ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ హీట్ నడుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికి తాజా పరిణామాల దృష్ట్యా ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయనేది అంచనా వేయలేని పరిస్థితి. ఓ వైపు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో కొత్తగా జమిలి ఎలక్షన్స్ విధానం తెరపైకి వస్తోంది. ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పేరుతో దేశమంతట ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించాలని కేంద్రం అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించింది. .

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనే వాదన రాజకీయ వర్గాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలను ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశం ఉందని అందులో భాగంగానే నవంబర్ లో లోక్ సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించి డిసెంబర్ లో పార్లమెంట్ రద్దు చేసి ఎలక్షన్స్ కు వెళ్లాలనే ప్లాన్ లో మోడీ సర్కార్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఎప్పుడు ఎలక్షన్స్ అనే విషయంలో ఎవరిలోనూ క్లారిటీ లేదు. ఎలక్షన్స్ విషయంలో ఇంత కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో మరి జమిలి ఎన్నికలపై ఎందుకు కసరత్తులు చేస్తున్నట్లు అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈలోపు ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవుతాయి. మరి అలాంటప్పుడు ఒకవేళ వచ్చే ఏడాది జమిలి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన ఆయా రాష్ట్రాల సంగతేంటి అనేది ఆసక్తికరంగా మారిన అంశం మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల విషయంలో మోడీ సర్కార్ కు అసలు క్లారిటీ వుందా లేదా అనే డౌట్లు వ్యక్తమౌతున్నాయి.

Also Read:కమలం కోల్డ్ వార్ 2.0 !

- Advertisement -