కమలం కోల్డ్ వార్ 2.0 !

39
- Advertisement -

గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో చర్చనీయం అవుతున్నాయో అందరికి తెలిసిందే. పార్టీలోని కీలక నేతలంతా ఎవరికి వారే ఎమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రగునందన్ రావు, వంటివారు ఒకరిపై ఒకరు చేస్కున్న పరోక్ష ఆరోపణలు ఆ పార్టీ పరువును నిలువునా గంగలో కలిపాయి. తాను అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో బండి సంజయ్ ఏకీకృతంగా వ్యవహరించడం, తనకు ప్రదాన్యం ఇవ్వడడం లేదని ఈటెల అసంతృప్తి వెళ్లగక్కడం, బండి సంజయ్ కంటే తనకు ఏం తక్కువ అని రగునందన్ అలకబునడం వంటి పరిణామాలు ఆ పార్టీ పెద్దలకు తీవ్ర తలనొప్పిగా మారుతూ వచ్చాయి. .

ఇక ఈ అంతర్గత విభేదాలు చిలికి చిలికి గాలి వానగా మారుతుండడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. తీర పరిస్థితులన్నీటిని చక్కదిద్దెందుకు అధ్యక్ష పదవిలో మార్పు, ఈటెల రాజేందర్ కు కీలక పదవి చేపట్టి కొంత మేర విభేదాలను తగ్గించింది. అయితే ఆ పార్టీలోని అమార్గత కుమ్ములాటలు మళ్ళీ రగులుగుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈటెల వర్సస్ బండి సంజయ్ గా సాగిన ఎపిసోడ్ ఇప్పుడు ఈటెల వర్సస్ కిషన్ రెడ్డిగా మారినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఈ ఇద్దరు ఏకాభిప్రాయనికి రావడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా ఉన్న ఈటెల.. కొన్ని నియోజిక వర్గాలకు తాను సూచించిన టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

Also Read:నిధి.. అక్కడ అలా, ఇక్కడ ఇలా

అటు కిషన్ రెడ్డి కూడా ఇదే వైఖరితో ఉన్నారట. దీంతో వీరిద్దరి మద్య కోల్డ్ వార్ నడుస్తోన్నట్లు టాక్. ఈ కోల్డ్ వార్ ఇలాగే కొనసాగితే బలమైన అభ్యర్థుల ఎంపిక జరగదేమో అని ఓ వర్గం బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉన్నప్పటీకి ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఎలాంటి కసరత్తులు జరగలేదట. దీనికి ప్రధాన కారణం అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉండడమే అని తెలుస్తోంది. దీంతో అసలే అభ్యర్థులు లేని పార్టీలో మళ్ళీ నేతల మద్య కోల్డ్ వార్ కొనసాగుతుండడంతో కమలం పార్టీ కథ కంచికి చేరేలా కనిపిస్తోంది.

- Advertisement -