విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ తీస్తున్న ఖుషి సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ అప్పటి నుండి బ్రేకులతో షూటింగ్ నత్త నడకన సాగుతుంది. ముఖ్యంగా రెండు షెడ్యూల్స్ తర్వాత సమంత అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ భారీ బ్రేక్ వచ్చేసింది. దీంతో హీరో విజయ్ నుండి అందరూ సమంత మళ్ళీ షూటింగ్ కి వచ్చే డే కోసం ఎదురుచూశారు.
తాజాగా సమంత ఖుషి షూటింగ్ లో అగుడు పెట్టింది. ఆమెకి టీం మళ్లీ వెల్కం చెప్పి ఉమెన్స్ డే సెలెబ్రేట్ చేసి ఫోటోస్ వదిలారు. దీంతో సమంత ఎట్టకేలకు ఖుషి కి డేట్స్ ఇచ్చిందని విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ షెడ్యూల్ కి ముందు సమంతా ముంబై శీతాడేల్ అనే సిరీస్ ఘాట్ కంప్లీట్ చేసుకుంది.
ఇకపై ఖుషి బ్రేక్స్ లేకుండా షూటింగ్ జరుపుకోనుంది. సమంత ఈ సినిమా కోసం ఇప్పుడు బంచ్ ఆఫ్ డేట్స్ ఇచ్చేసిందని తెలుస్తుంది. తన కారణంగా ఇంత వరకూ ఆగిన షూటింగ్ ను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేయాలనే భావనతో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ లేదా జులై లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..