ఇప్పుడు పాస్‌పోర్ట్‌ పొందడం చాలా ఈజీ..

199
No birth certificate needed for passport
- Advertisement -

ఇప్పుడు ఇండియన్స్‌ పాస్‌పోర్ట్‌ పొందడం మరింత ఈజీ అయింది. ఎందుకంటే..ఇక నుంచి పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన పనిలేదు.

ఆధార్, పాన్ కార్డు, ఎల్ఐసీ బాండ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే చాలని విదేశాంగశాఖ సహాయమంత్రి వికే సింగ్ తెలిపారు. పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

No birth certificate needed for passport

నిజానికి పాస్‌పోర్టు నిబంధనలు 1980 ప్రకారం.. జనవరి 26, 1989, ఆ తర్వాత పుట్టిన వారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది.

అయితే, ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి వీరు స్కూల్ ట్రాన్స్‌‌ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్ఐసీ పాలసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వారు, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -