చపాతీ గుండ్రంగా లేదని….చంపేశాడు

226
Woman killed By Husband For Not Making Round Chapatis
- Advertisement -

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా….డిల్లీలో జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. లేటుగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

వివరాల్లోకి వెళ్తె…ఉత్తర ఢిల్లీలో జహంగీర్‌పూర్‌కు చెందిన సిమ్రన్ అనే మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. చపాతి విషయంలో వచ్చిన చిన్న ఘర్షణ ఆమె ప్రాణాలు తీసింది. ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చపాతీలు గుండ్రంగా చేయలేదని నాన్న గొడవ పెట్టుకున్నారని, అయితే అమ్మ చాలా బాగు వండుతుందని మృతురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. అక్కడితో ఆగిపోకుండా శనివారం రాత్రి 10:30 గంటలకు మళ్లీ గొడవ మొదలవడంతో సిమ్రన్ పొట్టపై భర్త బలంగా తన్నడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన పాపను కూడా ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె గొంతు నులిమి హతమార్చాడు.

వివాహానికి ముందు ఈ దంపతులు ఏడాదిపాటు సహజీవనం చేశారు. అయిదేళ్ల కిందటే వివాహం చేసుకున్నారు. వ్యాపారంలో నష్టపోవడంతో గత రెండేళ్ల నుంచి స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

- Advertisement -