బాలు బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దుండగులు..

260
- Advertisement -

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ‘ఎస్పీబీ50’ మ్యూజిక్ కాన్సెర్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అమెరికాలో కాన్సెర్టులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఎస్పీ బాలుతన ఫేస్ బుక్ పేజ్ లో పాస్ట్ పోర్ట్ తో పాటు క్రెడిట్ కార్డ్స్, క్యాష్ మరియు ఐప్యాడ్ లాంటి విలువైన వస్తువులు పోగొట్టుకొట్టున్నట్టు ఓ పోస్టు పెట్టారు. దీంతో మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ఎస్పీ బాలు అమెరికాలో నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అక్కడ ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఆందోలనలో పడ్డారు.

S. P. Balasubrahmanyam Loses Bag

అమెరికా పర్యటనలో ఉన్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హూస్టన్ లో ‘ఎస్పీబీ 50’ టూర్ లో ఉండగా ఆయన బ్యాగ్ ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారని తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. దుండగులు ఎత్తుకెళ్లిన తన బ్యాగ్ లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులూ ఉన్నాయన్నారు. హూస్టన్ లో ని భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో డూప్లికేట్ పాస్ పోర్టును పొందానని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

అయితే, తన బ్యాగ్ చోరీకి గురైందనే సమాచారం తెలుసుకున్న తన అభిమానులు చాలా మంది ఆందోళన చెందుతున్నారని, తన కేమీ ఇబ్బంది లేదని, బాగానే ఉన్నానని అన్నారు. ‘యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.. గాడ్ బ్లెస్ యూ ఆల్’ అని ఎస్పీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, సియాటిల్, లాస్ ఏంజిల్స్, అట్లాంటాలో బాలు ప్రస్తుతం పర్యటిస్తున్నారు.

- Advertisement -