తమిళ పార్టీలతో పొత్తు ఉండదు: కమల్

68
kamal

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్ధానిక పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు మక్కల్ నీది మయ్యమ్ అధినేత,సినీ నటుడు కమల్ హాసన్. మీడియాతో మాట్లాడిన ఆయన తమిళ పార్టీలతో పొత్తు ఉండదని తెలిపారు.తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నది త్వరలో స్పష్టం చేస్తానని కమల్‌ తెలిపారు.

ఇప్పటికే కమల్‌తో పొత్తుకు సిద్దమని మజ్లిస్ పార్టీ ప్రకటించడంతో కమల్ ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 25 స్ధానాల్లో మజ్లిస్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇక రజనీ కూడా తన పార్టీని ప్రకటించడం,ఎన్నికల్లో పోటీకి సిద్దమని తెలపడంతో తమిళ రాజకీయాలు మరింత హీటెక్కాయి.