తెలంగాణ బీజేపీలో గత కొన్నాళ్లుగా గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత ఏర్పడ్డ అసంబద్దత తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీలోని నేతల మద్య విభేదాలు, వర్గపోరు, ఆధిపత్య కుమ్ములాటలు ఇలా అన్నీ కూడా ఆ పార్టీని తీవ్రంగా కుంగదీటున్నాయి. వచ్చే నెల 30 న ఎన్నికలు జరగనుండగా ఇప్పటివరకు ఆ పార్టీలో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. మరోవైపు అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా వెతుకులాటలోనే ఉంది. పార్టీకి నియోజిక వర్గాల వారీగా అభ్యర్థులు లేకపోవడంతో కమలనాథులు బిక్కముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. .
ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ పూర్తిగా చీకట్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ నేతలు.. తొలి జాబితాను ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటించాలని గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చారు. కాగా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తొలి జాబితా విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ అభ్యర్థుల ప్రకటన మరోసారి వాయిదా పడినట్లు తాజా సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేకపోవడం ఒక కారణమైతే.. ఆల్రెడీ అభ్యర్థులను ఎంపిక చేసిన స్థానాల్లో అసమ్మతి సెగలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయట.
అందుకే మరోసారి క్రాస్ చెక్ చేసుకునేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారట కమలనాథులు. దాంతో తొలి జాబితా ప్రకటన మరో రెండు లేదా మూడు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంచితే గత ఏడాది మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన రాజాసింగ్ పై ఉనన్ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల బరిలో రాజసింగ్ నిలిచే అవకాశం ఉంది. మరి తొలి జాబితాలో ఆయన పేరు ఉంటుందో లేదో చూడాలి.
Also Read:మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం..