జగన్‌ టీమ్‌లో NNN

394
ycp ministers
- Advertisement -

ఏపీమంత్రివర్గ విస్తరణ ఇవాళ జరగనుంది. ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణలో కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నిన్న జరిగిన వైసీపీఎల్పీ భేటీలో 25 మందితో కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం కేసీఆర్. వెనుకబడినవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌ 5గురిని ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. ఇక మంత్రివర్గవిస్తరణలో కొత్త,పాతవారికి ప్రాధాన్యం కల్పించిన జగన్‌ ముగ్గురు ‘నాని’లకు చోటు కల్పించారు. వారే కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని.

కొడాలి నాని..కృష్ణ జిల్లా గుడివాడ నుంచి నాలుగోసారి విజయం సాధించారు. జిల్లాలో సీనియర్‌గా ఉన్న నాని టీడీపీ నుంచి 2004,2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణమాల నేపథ్యంలో 2014,2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆళ్ల నాని..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మూడో సారి విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి విజయబావుటా ఎగురవేసిన నాని 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు.

పేర్ని నాని..కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.2004,2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నాని. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

- Advertisement -