గుడ్‌ న్యూస్‌..కేరళకు నైరుతి రుతుపవనాలు

350
wheather updates
- Advertisement -

వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. నైరుతి రుతుపవనాలు శనివారం (ఇవాళ) కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని పేర్కొంది.

రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మత్య్సకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

9న కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నారింజ హెచ్చరిక.. తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.

- Advertisement -