MLC Kavihta:ఐటీకి కేరాఫ్‌గా నిజామాబాద్‌

56
- Advertisement -

నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఐటీ హబ్‌ కేంద్ర బిందువు అవుతుందని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌ భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జాబ్‌మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కవిత.గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ హబ్‌ ఏర్పాటు గొప్ప విషయమని …విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే మహేశ్‌ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు కవిత.నిజామాబాద్‌ ఐటీ హబ్‌ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్‌ కూడా ప్రారంభిస్తామని చెప్పారు.

Also Read:Samajavaragamana:ఓటీటీ డేట్‌ ఫిక్స్‌

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను కూడా లెక్కచేయకుండా ఉద్యోగార్థులు జాబ్‌ మేళాకు హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబ్‌ మేళాతో ఎంతోమంది యువతీయువకుల కలలు సాకారం కాబోతున్నాయని తెలిపారు.

- Advertisement -