కీ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్‌!

43
- Advertisement -

టాలీవుడ్‌లో అతితక్కువ కాలంలో పాపులర్‌ అయిన హీరో విశ్వక్‌ సేన్‌. వైవిధ్యమైన సినిమాలతో మాస్‌ కా దాస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వక్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా తాజాగా తన తర్వాతి రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సినిమాల అప్‌డేట్ ఇచ్చారు.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం దాస్ కా ధమ్కీ. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకోగా తన చిత్రం 10, 11 ప్రాజెక్ట్స్ తో అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు చాలా బాగా షేప్ అవుట్ అవుతున్నాయని చెప్పారు. పదో చిత్రం రెండో షెడ్యూల్ ని ఇప్పుడు కంప్లీట్ చేశామని అలాగే దర్శకుడు రవితేజతో చేస్తున్న 11వ సినిమా కూడా 50 శాతం పూర్తయ్యిందని చెప్పుకొచ్చారు.

Also Read:రానా… హిరణ్యకశ్యప అనౌన్స్ మెంట్

ప్రతీ నెలలో రెండు సినిమాల షూటింగ్ 25 రోజులు షూటింగ్ చేస్తున్నాను ఈ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాల్సి అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -