Samajavaragamana:ఓటీటీ డేట్‌ ఫిక్స్‌

43
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి శ్రీవిష్షు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది.

తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా సెన్సేషనల్ రన్ ని అయితే నమోదు చేసింది. థియేటర్స్ లో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్‌ అయింది.

Also Read:సుధీర్ బాబు.. ‘హరోం హర’ ఉడిపి షెడ్యూల్

ఈ నెల 28న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్‌గా వెల్లడించారు. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈచిత్రం ఓటీటీలో ఏ మేరకు అలరిస్తుందో వేచిచూడాలి..

Also Read:రానా… హిరణ్యకశ్యప అనౌన్స్ మెంట్

- Advertisement -