మెగా ఫోన్ పడతానంటున్న నివేతా..!

97
nivetha

మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ నివేతా పేతురాజ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన కిష్టమైన ఫార్ములా కార్ రేసింగ్‌లో సత్తాచాటుతోంది. ఇటీవలె జరిగిన ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెవెల్ 1లో సర్టిఫికెట్ ను సంపాదించుకుని అందరి అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకుంది నివేతా.

ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను బయటపెట్టింది నివేతా. ఇక తనకి డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టమని చెబుతోంది. కొంతకాలం హీరోయిన్‌గా సినిమాలు చేసి ఆ తర్వాత కథ సిద్దం చేసుకొని డైరెక్షన్ చేస్తానని సన్నిహిత వర్గాల వద్ద చెబుతోందట.

ప్రస్తుతం తెలుగులోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లోనూ నివేతా నటిస్తోంది. ఆమె నటించిన ‘విరాటపర్వం’,వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘పార్టీ’, ఎ. ఎల్. విజయ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెంటల్ మదిలో సినిమా తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది.