సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ అద్భుతంగా బోణీ చేసింది. 17 ఓవర్ల వరకు మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వైపే ఉన్నా… నితీశ్ రాణా (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో ఈ జోడి బౌండరీల వర్షంతో కోల్‌కతాను వణికించింది.
19వ ఓవర్‌లో రాణా అవుట్ అయినా… చివరి ఓవర్‌లో కావాల్సిన 11 పరుగులను హార్దిక్ ఎలాంటి ఒత్తిడి లేకుండా సాధించాడు. దీనికితోడు కోల్‌కతా చెత్త ఫీల్డింగ్ కూడా ముంబైకి ఉపకరించింది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. నితీశ్ రాణాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కాడు.
కోల్‌కతా ఇన్నింగ్స్:
గంభీర్ (సి) మెక్లెనగన్ (బి) కృనాల్ 19; లిన్ ఎల్బీ (బి) బుమ్రా 32; ఉతప్ప (సి) హార్దిక్ (బి) కృనాల్ 4; మనీష్‌పాండే నాటౌట్ 81; యూసుఫ్ పఠాన్ (సి) హార్దిక్ (బి) కృనాల్ 6; సూర్యకుమార్ (సి) పొలార్డ్ (బి) మలింగ 17; వోక్స్ (సి) పొలార్డ్ (బి) మలింగ 9; నరైన్ ఎల్బీ (బి) మెక్లెనగన్ 1; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178;
వికెట్ల పతనం:
1-44, 2-48, 3-67, 4-87, 5-131, 6-144, 7-178;
బౌలింగ్: మలింగ 4-0-36-2; మెక్లెనగన్ 4-0-51-1; బుమ్రా 4-0-39-1; కృనాల్ పాండ్య 4-0-24-3; హర్భజన్ 4-0-27-0
ముంబయి ఇన్నింగ్స్:
పార్థివ్ ఎల్బీ (బి) కుల్దీప్ యాదవ్ 30; బట్లర్ ఎల్బీ (బి) రాజ్‌పుత్ 28; నితీష్ రాణా (సి) నరైన్ (బి) రాజ్‌పుత్ 50; రోహిత్‌శర్మ ఎల్బీ (బి) నరైన్ 2; కృనాల్ పాండ్య (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 11; పొలార్డ్ (సి) రిషి ధావన్ (బి) వోక్స్ 17; హర్దిక్ పాండ్య నాటౌట్ 29; హర్భజన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12;
మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 180;
వికెట్ల పతనం:
1-65, 2-71, 3-74, 4-97, 5-119, 6-160; బౌలింగ్: బౌల్ట్ 3.5-0-47-0; వోక్స్ 4-0-34-1; నరైన్ 4-0-22-1; కుల్దీప్ 4-0-35-1; రాజ్‌పుత్ 4-0-37-3