ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం నుండి కొలుకుని జట్టతో చేరనున్నాడు. గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సాధించినట్లుగా తెలుస్తోంది.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు నితీష్ రెడ్డి. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పక్కటెముకల గాయానికి గురి అయ్యాడు. దీంతో అతడు భారత జట్టుకు దూరం అయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
యోయో టెస్టులో అతడు 18.1 స్కోరు సాధించాడు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్‌లో ఆడనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ అతడిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది.
Also Read:IPL 2025: టీమ్స్… కెప్టెన్స్ వివరాలివే