ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. 2019 నుంచి ఢిల్లీ జట్టులో ఆటగాడిగా ఉన్నారు అక్షర్ పటేల్. ఇటీవల ఢిల్లీ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
అక్షర్ ఢిల్లీ తరుపున ఆరు సీజన్లలో 82 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఓవరాల్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 21.5 సగటు, 130.9 స్ట్రైక్‌రేటుతో 1653 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 7.27 ఎకానమీతో 123 వికెట్లు తీశాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోని జట్లలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. 17 సీజన్లలో ఆ జట్టు ఒక్కసారి మాత్రమే 2020లో ఫైనల్ కు చేరుకుంది. అయితే.. ఆఖరి మ్యాచ్‌లో తడబడి రన్నరప్‌గా నిలిచింది.
ఢిల్లీ జట్టు ఇదే..
అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వి, అజయ్ మండల్, మాన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారి, ముకేశ్ కుమార్, నటరాజన్, మోహిత్‌శర్మ, విప్రాజ్ నిగమ్, త్రిపుర విజయ్, కుల్‌దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, డొనోవాన్ ఫెరీరా, స్టబ్స్, చమీర.
Also Read:వైరల్ వీడియో.. విరాట్‌తో అనుష్క

