అరెరే.. ఏ హీరో వేధించలేదట

47
- Advertisement -

‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసిందని వార్తలు వచ్చాయి. ఓ కోలీవుడ్ స్టార్ హీరో తనను శారీరకంగా బాగా వేధించాడని, తమిళ్ ఇండస్ట్రీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని నిత్యా మీనన్ చెప్పింది అని ఆ వార్తల సారాంశం. దీంతో నిత్యా మీనన్‌ ను అంతలా ఇబ్బంది పెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ఎవరా? అంటూ పెద్ద చర్చ కూడా జరిగింది. చాలా మంది హీరోల పేర్లను నిత్యా మీనన్ కు అంటగట్టి వార్తలను వడ్డిస్తూ వచ్చారు గాసిప్ రాయుళ్లు.

ఐతే, తాజాగా మీడియా ప్రతినిధులతో నిత్యా మీనన్ సమావేశం అయ్యింది. తన ‘కుమారి శ్రీమతి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ తన పై వచ్చిన రూమర్స్ పై కూడా మాట్లాడింది. ‘నిత్యా మీనన్‌ అయిన తనను ఓ తమిళ హీరో షూటింగ్ సమయంలో బాగా వేధించినట్లు వచ్చిన వార్తలు నిజం కావు అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయంపై తమిళ క్రిటిక్ మనోబాల, నిత్యామీనన్‌ను ప్రశ్నించడంతో ఆమె ఈ విధంగా స్పందించింది. ఇంతకీ ఆమె స్పందన ఎలా ఉంది అనేది నిత్యా మీనన్ మాటల్లోనే విందాం. నేను ఎప్పుడూ అలా అనలేదు అని ఆమె పేర్కొంది.

అలాగే, తమిళ పరిశ్రమలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను అని వచ్చిన వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. మరెందుకు ? ఓ తమిళ స్టార్ హీరో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడని.. మిమ్మల్ని శారీరకంగా బాగా వాడుకున్నాడు అని వార్తలు వచ్చాయి ? అని సదరు మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించాడు. దీనిపై కూడా నిత్యా మీనన్ క్లారిటీ ఇస్తూ.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పై నిత్యం చాలా పుకార్లు వస్తాయి. వాటిని మనం పట్టించుకోకూడదు అని నిత్యా మీనన్ ఆ వార్తలకు ఫులిస్టాప్ పెట్టింది.

Also Read:IND vs AUS : క్లీన్ స్వీప్ చేస్తే సంచలనమే !

- Advertisement -