IND vs AUS : క్లీన్ స్వీప్ చేస్తే సంచలనమే !

25
- Advertisement -

భారత్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉంది. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్పు కు ముందు భారత్ ఈ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ విజయాలను నమోదు చేయడం అత్యంత సానుకూలాంశం. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్ సీనియర్ ఆటగాళ్లు ఎవరు లేకుండానే రెండు వన్డేలలో ఘన విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. దీంతో సిరీస్ ఇప్పటికే 2-0 తేడాతో సొంతమైంది. ఇక నేడు మూడో వన్డే జగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ చూస్తుంటే, ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అయిదు సార్లు వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టుగా ఆత్రేలియా కు రికార్డ్ ఉంది. .

అలాంటి జట్టును వరల్డ్ కప్ కు ముందు క్లీన్ స్వీప్ చేసి ఒడిస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో బలపడే అవకాశం ఉంది. ఇక మూడో వన్డేలో సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్ధిక్ పాండ్య వంటి ప్లేయర్స్ తిరిగి జట్టులోకి రావడం సానుకూలాంశం. ఇక ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్ శార్థూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు విశ్రాంతి లో ఉండనున్నారు. దాంతో ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, ఇషన్ కిషన్ బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియా దూకుడు చూస్తుంటే క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగని ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయడానిక్ వీలేదు. ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా పుంజుకుంటుందో అంచనా వేయడం కష్టం. వరల్డ్ కప్పు ముందు జరిగే ఈ చివరి మ్యాచ్ రెండు జట్లకు కూడా కీలకమే అందుకే. మూడో వన్డేలో విజయం కోసం టీమిండియా, ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా కసితో ఉన్నాయి. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:కుమారి శ్రీమతి..అంతా ఎంజాయ్ చేసే సిరీస్

- Advertisement -