దేశంలో 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం …డ్రాగన్ కంట్రీకి కొలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుండి చైనా ఇంకా తెరుకోకముందే మరో షాక్ ఇచ్చింది. రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
జాయింట్ వెంచర్లతో సహా ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని ఇకపై అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత, భవిష్యత్తు టెండర్లలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు. సరికొత్త సాంకేతికత, పరిశోధన, కన్సల్టెన్సీ, ఇతర పనుల కోసం ఎంఎస్‌ఎంఈలలో విదేశీ పెట్టుబడులను, జాయింట్ వెంచర్లను తాము ప్రోత్సహిస్తామని.. అయితే చైనా కంపెనీలకు మాత్రం ఆ అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు.
చైనా కంపెనీలపై నిషేధం విధిస్తూ మన దేశ కంపెనీలకు నిర్మాణాల్లో భాగస్వామ్యం కల్పించేలా నిబంధనల్లో సడలింపులు చేస్తూ త్వరలో ఒక విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు గడ్కరీ. దేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.