ఒక్కరోజే 1018…. 17 వేలకు చేరిన కరోనా కేసులు..

48
coronavirus

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 1018 కేసులు నమోదుకాగా ఇప్పటివరకు తెలంగాణలో 17357 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 92797 కరోనా టెస్టులు చేయగా 267 మంది మృత్యువాతపడ్డారు.

బుధవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 881 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మేడ్చల్‌ 36, రంగారెడ్డి 33, మహబూబ్‌నగర్‌ 10, వరంగల్‌ రూరల్‌ 9, మంచిర్యాల 9, ఖమ్మం 7, నల్లగొండ, జగిత్యాల 4 కేసులు నమోదయ్యాయి.

సిద్దిపేట, నిజామాబాద్‌ మూడేసి, సంగారెడ్డి, కరీంనగర్‌, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్‌, మెదక్‌, యాదాద్రి, ఆదిలాబాద్‌ జిల్లాలో 2 చొప్పున గద్వాల్‌లో ఒక కేసు నమోదయ్యాయి.

సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ దవాఖానకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కళాశాల డీన్‌ ఎం శ్రీనివాస్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఇక గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.