ఏ తండ్రికీ రాకూడదు: నారాయణ

235
- Advertisement -

నారాయణ విద్యాసంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్‌ రెండుపదుల ప్రాయంలోనే దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచేసింది. మంత్రి నారాయణ, రమాదేవి దంపతులకు కుమారుడు నిషిత్‌, కుమార్తె సింధు ఉన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో హైదరాబాద్‌లోని సంస్థల కార్పొరేట్‌ కార్యాలయానికి వచ్చి సమీక్షల్లో నిషిత్‌ పాల్గొనేవాడు. ఇలా విద్యాసంస్థలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండటం.. మంత్రి హోదాలో నారాయణ బిజీ కావటంతో ఆరు నెలల కిందట సంస్థకు డైరెక్టర్‌ హోదాలో పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నాడు. ఎండీగా సోదరి సింధు వ్యవహరిస్తున్నారు.

ni

నిషిత్‌ మృతదేహం బుధవారం రాత్రి నెల్లూరుకు చేరింది. వెంట తల్లి రమాదేవి కూడా వచ్చారు. అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించాలని తొలుత భావించినా నారాయణ సూచన మేరకు పుట్టిన ప్రదేశం నెలూరుకు తరలించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

నిషిత్‌ నారాయణగూడలోని తమ విద్యాసంస్థల కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ అక్కడే ఉన్నారు. భారీగా వర్షం కురుస్తుండటంతో అది తగ్గాక రాత్రి 2.20 గంటలకు అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని నివాసానికి తన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు(టీఎస్‌ 07 ఎఫ్‌కే 7117)లో బయలుదేరారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటిన తరువాత 200 మీటర్ల దూరంలో ఉన్న ‘మెట్రో స్తంభం 9ఆర్‌ యూను ఈ కారు బలంగా ఢీకొంది. ఆ వేగానికి స్తంభాన్ని ఢీకొన్న కారు మళ్లీ రెండు మీటర్లు వెనక్కి వచ్చి ఆగింది. దీంతో నిశిత్, స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందారు.

11brk32-narayana

మంగళవారం రాత్రి 11 సమయంలో నిషిత్ తో నారాయణ మాట్లాడారు. “నాన్నా నిషీ ఎక్కడున్నావ్… ఇప్పుడు రాత్రి 11 గంటలవుతోంది. ఇంకా ఇంటికి వెళ్లలేదా? భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. ఇక్కడ నను బిజీగా ఉన్నా. రెండు రోజుల్లో ఇంటికొస్తా. కారు నడిపేటప్పుడు జాగ్రత్త” అంటూ ప్రేమగా మాట్లాడారు. త్వరగా ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఆపై నాలుగు గంటల వ్యవధిలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

రాత్రి 8 గంటలకు చెన్నై చేరుకోవాల్సిన నారాయణ.. లండన్ నుంచి విమానం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్నారు. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. దీంతో ఆయన వేకువ జాము 4 గంటల సమయంలో నెల్లూరు చేరుకున్నారు. అనంతరం ఆయన కుమారుడి మృత దేహాన్ని చూసి భోరున విలపించారు. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచర మంత్రులు ఆయనను ఓదార్చారు.

nishith

కారు నెంబ‌ర్ టీఎస్ 07 ఎఫ్ కే 7117. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ లో రోడ్డు ప్రమాదంలో పిల్లర్ ను ఢీ కొట్టిన సమయంలో కారు సుమారు 205 కి.మీ వేగంతో నడుస్తోందని స్పీడోమీటర్‌ సూచించింది. దీంతో ఎన్నో జాగ్రత్తలతో తయారైన రెండున్నర కోట్ల రూపాయల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు కూడా వారిని రక్షించలేకపోయింది.

61494397273_Unknown

మంత్రి నారాయణ కుమారుడు ఇంత వేగంగా కారు నడపడం ఇదే మొదటిసారి కాదు. ఆయనకు ముందునుంచే వేగంగా కారు నడిపే అలవాటు ఉందని క్రింది ఘటనలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు వేగంగా కారు నడినందుకు పలు సార్లు ట్రాఫిక్ జరిమానాలు కూడా చెల్లించాడు నిశిత్.

1

ఈ ఏడాది తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో నిషిత్‌ కారు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసుల స్పీడ్‌ గన్‌ కెమెరాలకు చిక్కారు. అందులో ఆయన కారు వేగం 150 కిలోమీటర్లుగా చూపించింది.

3

అలాగే, మార్చి 1, 2017న మరోసారి గండిపేట వద్ద అదే 150 కిలోమీటర్ల వేగంతో, మార్చి 10, 2017న మాదాపూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో అతివేగంతో కారు నడిపారు. అతి వేగం కారణంగా ఆయన నడిపిన కారు టీఎస్‌ 07 ఎఫ్‌కే7117 కారుపై రూ.4305 జరిమానాను ట్రాఫిక్‌ పోలీసులు వేశారు.

2

తాజాగా జరిగిన ప్రమాదాన్ని బట్టి నిషిత్‌ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారని తెలుస్తోంది. అందుకే ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం.. అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి దురదృష్ట ఘటనలు చోటు చేసుకోవడం ఎంతో మందికి ఆవేదనను కలిగిస్తోందన్నది మాత్రం వాస్తవం…

- Advertisement -