బీజేపీ ఎంపీ కామెంట్స్‌తో ఒడిశాలో దుమారం!

8
- Advertisement -

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌పై… బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను బీజేడీ తీవ్రంగా ఖండించడంతో వివాదం మరింత ముదిరింది.

నిశికాంత్ దుబే చేసిన ఆరోపణల ప్రకారం… 1962 ఇండియా-చైనా యుద్ధం సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ,అమెరికా ప్రభుత్వం, CIAతో సంబంధాలు కలిగి ఉన్నారని బిజూ పట్నాయక్ ఆ సంబంధాల్లో మధ్యవర్తిగా పనిచేశారని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్పందనకు దారితీశాయి.

బీజేడీ ఎంపీ సస్మిత్ పత్రా ఈ వ్యాఖ్యలను అత్యంత అవమానకరమైనవి, అసత్యాలు గా అభివర్ణించారు. ఆందోళనగా ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (కమ్యూనికేషన్స్ & ఐటీ) నుంచి రాజీనామా చేశారు.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.దుబే వ్యాఖ్యలను “అసంబద్ధమైనవి”గా పేర్కొంటూ, బిజూ పట్నాయక్ ధైర్యసాహసాలను గుర్తుచేశారు.చైనా దాడి సమయంలో ఆయన ఎంతో ధైర్యంగా పోరాడారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం అన్నారు.

- Advertisement -