పెద్ద ప్రేగు క్యాన్సర్..ఇవి అస్సలు తినకూడదు?

6
- Advertisement -

భారతదేశంలో పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు యువతలో పెరుగుతున్నాయనే విషయంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు 30–40 ఏళ్ల మధ్య వయస్సులోనే ఎక్కువగా కనిపించడం గమనార్హం.

మన కడుపులో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. వీటినే ‘మైక్రోబయోమ్’ అంటారు.ఇది సమతుల్యంలో ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అసమతుల్యం అయితే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది.ఈ రోజుల్లో జీవనశైలి మార్పులు గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం
ఫైబర్ తగ్గిపోవడం
యాంటీబయాటిక్స్ అధిక వినియోగం
వ్యాయామం లేకపోవడం
నిద్రలేమి, ఒత్తిడి

ఇవి కలిసి గట్‌లో మంచి బ్యాక్టీరియాను తగ్గించి, చెడు బ్యాక్టీరియాను పెంచుతాయి.గట్ బ్యాలెన్స్ దెబ్బతింటే శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది కొలోరెక్టల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి.అవసరం లేని సమయంలో యాంటీబయాటిక్స్ వాడటం గట్‌ను బలహీనపరుస్తుంది.ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల గట్‌కు అవసరమైన ఫైబర్ అందదు.దీంతో శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది.

సులభమైన జీవనశైలి మార్పులతో గట్ ఆరోగ్యాన్ని తిరిగి మెరుగుపరచవచ్చు.ఇంట్లో తయారు చేసే మజ్జిగ, కాంజీ, ఇడ్లీ, దోశ వంటి ఆహారం,పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు ఎక్కువగా తీసుకోవడం.ఇవి గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

గట్ ఆరోగ్యాన్ని కాపాడే చిన్న మార్పులు
రెగ్యులర్ వ్యాయామం
సరైన నిద్ర
యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాడటం
ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం
ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వడం

కొలోరెక్టల్ క్యాన్సర్ పెరుగుదల మన జీవనశైలి మార్పులకు సంకేతం. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

- Advertisement -