ఎయిర్‌పోర్టులో రూ.10కే ఛాయ్..ఆప్‌ ఎంపీ ప్రశంసలు

10
- Advertisement -

విమానాశ్రయాల్లో అధిక ధరల ఆహారంపై ఎప్పటి నుంచో ఉన్న అసంతృప్తికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉడాన్ యాత్రి కేఫే’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోతో ఈ కేఫే గురించి మళ్లీ చర్చ మొదలైంది.

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఉడాన్ యాత్రి కేఫేలో రూ.10కి టీ తాగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఖర్చు తక్కువ, సేవ బాగుంది, డబ్బుకు విలువ ఉంది అంటూ ప్రయాణికులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

‘ఉడాన్ యాత్రి కేఫే’…దీనిని కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి ప్రారంభించాయి.
ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం,విమానాశ్రయాల్లో ఖర్చులను తగ్గించడం లక్ష్యం.
ముందున్న పరిస్థితి

ఈ కార్యక్రమానికి ముందు విమానాశ్రాయాల్లో నీటి బాటిల్ ధర రూ.100 వరకు ఉండేది.సమోసా వంటి స్నాక్స్ రూ.150–200 వరకు ఉండేవి.ఈ ధరలు మధ్యతరగతి ప్రయాణికులకు భారంగా మారేవి.

మొదటి ఉడాన్ యాత్రి కేఫే 2024 డిసెంబర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రయాణికులలో మంచి ఆదరణ పొందింది.2026 నాటికి దేశంలోని ఎక్కువగా AAI నిర్వహించే ప్రధాన విమానాశ్రయాల్లో ఈ కేఫేలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

 

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

- Advertisement -