నిర్భయ దొషులకు ఫిబ్రవరి1న ఉరిశిక్ష

358
Nirbhaya case
- Advertisement -

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది పటియాల కోర్టు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఈ ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

వీరికి ఈ నెల 22న ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ… వివిధ సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. ముఖేశ్ సింగ్ పిటిషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించగా అనంతరం కేంద్ర హోంశాఖకు పంపించారు. రాష్ట్రపతి కూడా ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. మరోవైపు ఇన్ని సార్లు ఉరిశిక్ష వాయిదా వేయడం సరైందికాదని ఆరోపిస్తుంది నిర్భయ తల్లి.

- Advertisement -