నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కొల్లాపూర్ రైతు అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పద్మావతి పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు సమస్యలు సర్కారు దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలు రోడ్ల మీదకు వచ్చేది. ఈ రోజు ప్రజల అవసరాలు గుర్తెరిగి పనిచేస్తున్న ప్రభుత్వానికి అభినంనదనలు తెలిపేందుకు రోడ్ల మీదకు రావడం తెలంగాణలో కొత్త చరిత్ర అన్నారు. పంటల కాలంలో ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలిరావడం కేసీఆర్ గారి మీద ప్రభుత్వం ఉన్న అభిమానానికి నిదర్శనం. వ్యవసాయరంగం బలోపేతం అయితే సమాజం సంతోషంగా ఉంటదని ఆరేళ్లుగా కేసీఆర్ గారు వ్యవసాయ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు దృష్టితో, కూలీల కోణంతో రైతు అనుకూల, వ్యవసాయరంగ ప్రోత్సాహ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరంటు లేదు. రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండ .. రైతు మరణించిన వారంలో పైరవీకారులతో సంబంధలేకుండా నేరుగా రైతు కుటుంబసభ్యుల ఖాతాలో రూ.5 లక్షలు జమ అవుతాయి. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదు. 9 నెలలు భూరికార్డుల సర్వే చేయించి రైతులకు కొత్త పాస్ బుక్ లు అందజేసి దాని ఆధారంగా ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు భూ సమస్యలు ఉండొద్దు.. గ్రామాలు ప్రశాతంగా ఉండాలని భావించి కేసీఆర్ గారు కొత్త రెవిన్యూ చట్టం అమల్లోకి తీసుకువచ్చారు. రైతులు, భూయజమానులు భూరికార్డులు, భూ హక్కుల విషయంలో ఇక భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కేంద్ర వ్యవసాయ చట్టం దేశ రైతాంగం పాలిట శాపం. కార్పోరేట్లు, బహుళజాతి కంపెనీలకు రైతుల కష్టం దోచిపెట్టేందుకే కేంద్ర వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది. కొత్తచట్టంతో రైతుకు కనీస మద్దతుధర నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకుంటుంది. చట్టంలో పెట్టని మద్దతుధర విషయం గురించి కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనలలో మద్దతుధరకు ఇబ్బందిలేదని రైతులను మోసం చేస్తుంది. కేంద్ర వ్యవసాయ చట్టాన్ని టీఆర్ఎస్ తోపాటు 12 పార్టీలు పార్లమెంటులో లోపలా, బయటా వ్యతిరేకించాయి. వ్యవసాయ బిల్లుల చట్టంపై వ్యతిరేకత చూసి కరంటు చట్టాన్ని పక్కకు పెట్టింది.. అది వస్తే రైతులు, వ్యవసాయరంగ పరిస్థితి అదోగతి పాలౌతుంది. కేంద్రం రైతుల మోటర్లకు మీటర్లు పెడితే కేంద్రాన్ని నడిపే బీజేపీ పార్టీకి రైతులు మీటర్లు పెడతారని మంత్రి విమర్శించారు. దేశంలో అన్ని పంటలు పండే ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దేశానికి కేసీఆర్ గారు తొవ్వ జూపే రోజులొస్తాయి. ప్రజల ఆశీస్సులు, అండదండలతో కేసీఆర్ గారు ముందుకుసాగుతారు.సోమశిల వంతెన కేసీఆర్ గారి ఆశీస్సులతో నిర్మిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.