టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ…

172
kohli

ఐపీఎల్‌-13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆడమ్‌ జంపా, గుర్‌కీరత్‌ మన్‌ స్థానంలో మొయిన్‌ అలీ, మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి విరాట్ రాగా గాయం కారణంగా ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

ఇక ఢిల్లీ సైతం ఒక మార్పుతో రంగంలోకి దిగింది. అమిత్ మిశ్రా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న ఢిల్లీ కూడా జోరుమీదున్నది. రెండు జట్లు సమతూకంగా ఉండటంతో రసవత్తర పోరు జరగనుంది.