నీళ్లడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తారా అని మండిపడ్డారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పొలాలు ఎండుతున్నాయని జూరాల గేట్లు తెరిచి నీటిని వదిలిన రైతులపై గుట్టుచప్పుడు కాకుండా కేసులు పెట్టడం దుర్మార్గం…14 మంది రైతుల మీద నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో కరెంట్ బిల్లులు కట్టలేదని ఒక్క గట్టు మండలంలోనే రైతుల మీద మూడు వేల కేసులు నమోదు చేసి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది… పాలమూరుకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మరణశాసనం అన్నారు.
Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం
ఈ మూడు పార్టీలు తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ భవిష్యత్తు దెబ్బతీస్తున్నాయి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపడం కుట్ర అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది… కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రానికి సబ్మిట్ చేయలేదు…తెలంగాణ వచ్చిన వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రానికి సబ్మిట్ చేయడం జరిగింది అన్నారు.

