- Advertisement -
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. జావెలిన్ త్రో పోటీల్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇక ఈ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్స్ అడుతున్న నీరజ్..అందరి కంటే ఎక్కువ దూరం అంటే 86.65 మీటర్లు జావెలిన్ విసిరాడు. ఆగస్టు 7న జరిగే ఫైనల్లో టాప్ – 3లో నిలిస్తే ఏదో ఒక పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది.. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లయింది.
- Advertisement -