మారుతి దర్శకత్వంలో చిరు…?

103
chiru

ఆచార్య తర్వాత వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ మూవీలో నటిస్తుండగా తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మెగాస్టార్. విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి…. మెగాస్టార్ కు కథ వినిపించగా ఆయన ఒకే చెప్పారని టాక్.

మారుతి ఎప్పటినుండో మెగాస్టార్ తో పనిచేయాలనుకుంటున్నాడు. ఆ క‌ల ఈ సినిమాతో తీర‌నుంద‌ని అంటున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని టాక్ నడుస్తుండగా ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.

ప్రస్తుతం కొరాటల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాతో బిజీ ఉన్నారు చిరు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్, మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో వేదాళం రీమేక్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.