ఎస్సై శ్రీనివాస్‌ రెడ్డి అరెస్ట్..రిమాండ్‌కు తరలింపు

192
srinivas si

మహబూబాబాద్ జిల్లాలో ట్రైనీ మహిళా SIపై అత్యాచారయత్నానికి పాల్పడిన SI శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిన్న వరంగల్ పోలీస్ కమిషనర్ కు బాధితురాలు ఫిర్యాదు చేయగా వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

మహబూబాబాద్ sp కోటిరెడ్డి ఆదేశాల మేరకు మరిపెడ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేశారు. SC-ST అట్రాసిటీ కేసుతో పాటు, అత్యాచార యత్నం కేసులు నమోదు చేయగా తదుపరి విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీని నియమించారు. ఇవాళ ఉదయం ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.