నిన్నటి నుంచే మహేష్ యాక్షన్

82
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నిన్న సారథి స్టూడియోస్‌లో ప్రారంభమైంది, మహేష్ బాబు కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. రఫ్ అండ్ రగ్గుడ్ లుక్‌లో మహేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడట. ఇక నిన్నటి నుంచి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ లో మహేష్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 2 వరకు ఈ షెడ్యూల్ షూట్ జరగనుంది. ఇక ఈ మూవీ కథేంటి ? జోనర్ ఏంటీ ? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేస్తున్నాయి. ఐతే, ఇదొక పొలిటికల్ అడ్వెంచర్ అని, ఇంకా స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది.

మహేష్ – త్రివిక్రమ్ గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటే.. భారీ యాక్షన్ తో పాటు భారీ తారాగణం కూడా ఉంటుంది. అందుకే, ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహేష్-పూజా కాంబినేషన్ లో మహర్షి చిత్రం తెరకెక్కింది. అది సూపర్ హిట్ అయినట్టే.. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే మరో ప్రధాన పాత్రలో బిగ్ బి అమితాబ్ ను తీసుకోబోతున్నారు. మరి అమితాబ్ తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ ను చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు.

ఇవి కూడా చదవండి…

బాలయ్య సినిమాలో అతను కూడా

జబర్ధస్త్‌ రాకేష్ సుజాతల పెళ్లి ఫిక్స్‌

ఓటీటీ : ఈ వారం కంటెంట్

- Advertisement -