- Advertisement -
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత అవాహన తెచ్చిన బాధితులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఈ చాలన్ పేరుతో ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్ తెరిచారో అంతేనని చెబుతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన రాంబాబు ఎరువుల దుకాణ డీలర్. తోటి డీలర్ల వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ఈ చలాన్ పీడీఎఫ్ ఏపీకేని తెరిచారు రాంబాబు.
Also Read:TRFను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
అంతే వెంటనే ఫోన్ వేడెక్కి విడతల వారిగా రూ.49,500, రూ.10,000, రూ.10,000 ఇలా రూ.70,000 లూటీ చేశారు సైబర్ నేరగాళ్లు. వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్ళి తన ఖాతాను క్లోజ్ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు రాంబాబు.
- Advertisement -

